Breaking

Wednesday, November 17, 2021

Fitness Body: Diet vs Exercise which is better for weight loss?

Fitness Body: Diet vs Exercise which is better for weight loss?

Fitness Body: Diet vs Exercise which is better for weight loss?


Are you exercising to lose weight? Are you dieting? Confused not knowing which of the two is better? However, you need to know these things.
 
Many people choose many ways to lose weight. Some people want to lose weight easily without making it difficult for the body. Dieting is chosen for this. Others believe that exercise is the only way to lose weight. Exercise is thought to bring not only weight loss but also good shape to the body. The only way they can do that is to aim for something else. And, do you lose weight quickly with exercise? Or with dietary restrictions? Is still a riddle question. Therefore, we are going to give you some details on how Diet .. Exercise .. can be used to lose weight.

Diet vs Exercise: Regardless of whether your body is fit or not .. what kind of food you take on a regular basis is very important. Because .. your body depends on the food you take is yours. Food is also essential for providing the body with the nutrients it needs. Exercise is only for dissolving the accumulated fat in the body and keeping it fit. However, if you take good food regularly .. you can achieve fitness without working out with exercise. It is also not advisable to neglect exercise as such. Exercise at least 30 minutes a day. You need to be aware of the calories, carbs, and fats in your diet.

What do studies say ?: All the calories your body gets come from food. If you exercise and fail to control your calories, you will burn only a small percentage of calories. However, the basal metabolic rate consumes 60 to 80 percent of the total energy produced by the body. About 10 percent of calories are expended to digest food. Studies show that the rest of the calories are expended through physical activity.

Is Exercise Necessary ?: How can it be said that dieting is good. The question that arises in everyone is whether to stay away from exercise. Doing so would be a mistake. If you want to lose a few kilos of body weight, you need 80 percent of the nutrients. 20 percent should get exercise. There are also health benefits to doing this over and over. Exercise keeps your body in good shape. Muscles stiffen. Exercising regularly can improve your heart health. Exercise can help keep your bones strong. Your mood and ability will improve even more. Even if you have no idea how to lose weight, it is best to set aside at least 30 to 40 minutes a day for exercise.

Which is better ?: Finally .. when it comes to what is good in exercise and diet .. both are essential for the body. Diet can help you lose weight. Exercise can help keep you fit and healthy. You do not have to go to the gym every day to do exercises. Running, jogging, or walking in the morning is enough. It is better to set aside some time and do yoga. We need to know how important it is to eat and sleep. It is just as important to exercise. So .. stay away from junk food. Food that is good for the body. Stay fit with exercise.

Note: These details are provided by health experts and studies. This article is just for your understanding. The best way is to consult a doctor for any minor health problem. Can notice.

                         ☾☽☾☽✿❀✿Telugu✿❀✿☾☽☾☽

ఫిట్‌నెస్ బాడీ: బరువు తగ్గడానికి ఆహారం vs వ్యాయామం ఏది మంచిది?


బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నారా? మీరు డైటింగ్ చేస్తున్నారా? రెండింటిలో ఏది మంచిదో తెలియక అయోమయంలో పడ్డారా? అయితే, మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి.
 
చాలా మంది బరువు తగ్గడానికి అనేక మార్గాలను ఎంచుకుంటారు. కొంత మంది శరీరానికి ఇబ్బంది కలగకుండా సులభంగా బరువు తగ్గాలని కోరుకుంటారు. ఇందుకోసం డైటింగ్‌ని ఎంచుకుంటున్నారు. మరికొందరు బరువు తగ్గడానికి వ్యాయామమే ఏకైక మార్గం అని నమ్ముతారు. వ్యాయామం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరానికి మంచి ఆకృతి కూడా వస్తుందని భావిస్తున్నారు. వారు చేయగల ఏకైక మార్గం వేరొకదానిని లక్ష్యంగా చేసుకోవడం. మరి, వ్యాయామంతో త్వరగా బరువు తగ్గుతున్నారా? లేక ఆహార నియంత్రణలతోనా? అనేది ఇప్పటికీ చిక్కు ప్రశ్న. అందుకే, బరువు తగ్గడానికి డైట్.. వ్యాయామం.. ఎలా ఉపయోగపడతాయో కొన్ని వివరాలను మీకు అందించబోతున్నాం.

డైట్ వర్సెస్ వ్యాయామం: మీ శరీరం ఫిట్‌గా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా.. మీరు రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. మీరు తీసుకునే ఆహారం మీదే మీ శరీరం ఆధారపడి ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి ఆహారం కూడా చాలా అవసరం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి ఫిట్‌గా ఉంచుకోవడం కోసమే వ్యాయామం. అయితే రెగ్యులర్ గా మంచి ఆహారం తీసుకుంటే.. వ్యాయామంతో పనిలేకుండా ఫిట్ నెస్ సాధించవచ్చు. అలాగని వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదు. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. మీ ఆహారంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వుల గురించి మీరు తెలుసుకోవాలి.

అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి?: మీ శరీరానికి లభించే అన్ని కేలరీలు ఆహారం నుండి వస్తాయి. మీరు వ్యాయామం చేసి, మీ కేలరీలను నియంత్రించడంలో విఫలమైతే, మీరు తక్కువ శాతం కేలరీలు మాత్రమే ఖర్చు చేస్తారు. అయినప్పటికీ, బేసల్ మెటబాలిక్ రేటు శరీరం ఉత్పత్తి చేసే మొత్తం శక్తిలో 60 నుండి 80 శాతం వినియోగిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి దాదాపు 10 శాతం కేలరీలు ఖర్చవుతాయి. మిగిలిన కేలరీలు శారీరక శ్రమ ద్వారా ఖర్చవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

వ్యాయామం అవసరమా?: డైటింగ్ మంచిదని ఎలా చెప్పాలి. వ్యాయామానికి దూరంగా ఉండాలా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అలా చేస్తే తప్పే అవుతుంది. కొన్ని కిలోల శరీర బరువు తగ్గాలంటే 80 శాతం పోషకాలు కావాలి. 20 శాతం వ్యాయామం చేయాలి. ఇలా పదే పదే చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వ్యాయామం మీ శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచుతుంది. కండరాలు గట్టిపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం మీ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ మానసిక స్థితి మరియు సామర్థ్యం మరింత మెరుగుపడతాయి. బరువు తగ్గడం ఎలా అనే ఆలోచన లేకపోయినా, రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం కోసం కేటాయించడం మంచిది.

ఏది మంచిది?: చివరగా.. వ్యాయామం, ఆహారంలో ఏది మంచిది అనే విషయానికి వస్తే.. రెండూ శరీరానికి అవసరం. ఆహారం బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. వ్యాయామం మిమ్మల్ని ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వ్యాయామాలు చేయడానికి ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే రన్నింగ్, జాగింగ్ లేదా వాకింగ్ చేస్తే సరిపోతుంది. కొంత సమయం కేటాయించి యోగా చేయడం మంచిది. తినడం, నిద్రపోవడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి.. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి. శరీరానికి మేలు చేసే ఆహారం. వ్యాయామంతో ఫిట్‌గా ఉండండి.

గమనిక: ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు మరియు అధ్యయనాల ద్వారా అందించబడ్డాయి. ఈ వ్యాసం మీ అవగాహన కోసమే. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమ మార్గం. గమనించగలరు.



No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.