Breaking

Friday, October 18, 2019

Causes of diabetes, precautions to avoid



Sugar Disease .. Instead of suffering after this problem. It is better to take precautions. Similarly. What habits cause diabetes? What precautions should be taken? Now let's learn about this.

Causes of diabetes, precautions to avoid
Diabetes is a kind of sweet enemy. Sweet means that someone likes sugar. But, if the same sugar is added to the body, it will eventually become a health problem. According to a study, the number of sugar cases in India is increasing every day. Why is this happening? What are the reasons for this? What is the solution to the problem? What precautions to take. Let's look at all these details.

How much sugar can you eat per day

We take sugar in some form per day. Tea, Coffee, Cool Drinks, Sugar, etc., come in many forms. Nijaniki. Scientists at the National Institute of Nutrition in Hyderabad have warned that taking half a gram of sugar a day could cause illness. But, why do we make those calculations? Sugar is not suitable in tea .. Sweets and bakery items likewise come to mind. We eat only one piece. We make the body like a sugar factory. This is not just diabetes. All the other health issues are around. Health experts warn that obesity, heart problems and excessive intake of sweets can cause eyesight, sinus and hearing problems at an early age. In addition, many problems have been reported to impair immunity. So .. advise not to reduce sugar consumption.

Sugar is going into the body

Sugar does not go into the body only. Vegetables, fruits, milk, and bread also go into the body in the form of carbohydrates. However, sugar derived from vegetables, fruits, and milk is not harmful. This is because they contain vitamins, proteins, and nutrients. They contain no sugar. However, the carbohydrates in the sweetener we consume convert the glucose into energy. Everything else turns out to be fat.

Substitute for sugar.

Sugar should not be abolished at all. However .. if this is difficult .. there are alternatives. One of them is honey. Yes, there are many benefits to taking Honey. These are good for the body. Instead of sugar in sweets, cakes and green tea, honey can be added. This can help you recover from the side effects of sugar.

Stevia, a sweet extract from the plant, is also found in various markets. However, it should take something refined rather than straightforward.
You can also take jaggery.

However, it should be remembered that it is not advisable to use pills available in the market.
All of us have forgotten all the traditional Indian dishes. How many people eat sesame seeds and coconut brownies. These are good to eat. Eating them has no meaning other than nutrients. But, all these things are more than ever. Just pizzas, burgers, cakes. This is what you eat. The consequence of this is childhood obesity. Many problems. In a way, it is fun to look at children now. They don't have the merits of our cooking. Because if we tell them we know what they eat, they eat the same thing. Problems are being bought. Still awake and try to get out of the problem.

Types of Diabetes .. There are several types of diabetes ..

Type 1 diabetes: stops insulin production from the pancreas. As a result, blood glucose reserves increase. Scientists have not yet figured out why.
Approximately 10 percent of people with sugar disease have type 1.

Type 2 diabetes: The pancreas does not produce enough insulin. Even if a product does not work efficiently. It is more common in middle-aged and elderly people. It is more for overweight and bodybuilding.

Some women have type 2 diabetes during pregnancy. This is because their bodies cannot produce enough insulin for the baby in the womb. Dietary restrictions include the use of insulin to control sugar levels if needed.

Diabetes symptoms 


  1. Too much urination, too much at night ..
  2. Excessive thirst.
  3. Feeling tired.
  4. Decreased vision.
  5. No injuries or blows on the body
  6. In addition, there are many other symptoms. Sometimes diabetes attacks without any symptoms. So you should always keep checking.


Precautions to be taken.


  1. Diabetes depends on genetic and environmental factors. Sugar levels can be controlled if diet and lifestyle are right.
  2. Include fruits, vegetables, beans and whole grains in your diet while avoiding sugar.
  3. Eat healthy oils, lentils, sardines, and omega-3 foods.
  4. Exercise is very important. Doing one exercise at least two and a half hours per week.
  5. Certainly you should eat fresh vegetables, greens, and fruits.
  6. In addition to this, sugar should be reduced. It is advisable to reduce the sugar content in soft drinks, coffee, and tea.
  7. Similarly, sleeping at the right time and sleeping. More or fewer health problems are common. So don't take any risks.
  8. Similarly .. All tests should be done from time to time.
  9. Diabetes is a source of all problems. It is therefore important to be cautious before the issue.

TELUGU 

డయాబెటీస్‌కి కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

షుగర్ వ్యాధి.. ఈ సమస్య వచ్చిన తర్వాత బాధపడే బదులు.. ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా. ఏయే అలవాట్లు డయాబెటిస్కి కారణం. వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటివన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్‌కి కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
డయాబెటిస్.. ఓ రకంగా చెప్పాలంటే తీయని శత్రువు అని చెప్పొచ్చు. తీపి అంటే చక్కెరను ఎవరైనా ఇష్టపడతారు. కానీ, అదే చక్కెర ఎక్కువగా శరీరంలోకి చేరితే అది ముదిరి పాకాన పడి ఆరోగ్య సమస్యగా మారుతుంది. ఓ అధ్యయనం ప్రకారం భారత్ రోజురోజుకీ షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది. ఇందుకు గల కారణాలు ఏంటి. సమస్యకి పరిష్కారం ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.

చక్కెర రోజుకి ఎంత తినొచ్చు..

రోజుకి ఏదో రూపంలో మనం చక్కెరను తీసుకుంటాం. అది టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఇలా అనేక రూపాల్లో చక్కెర మన ఒంట్లోకి చేరుతుంటుంది. నిజానికీ. రోజుకు పాతి నుంచి ముప్పై గ్రాములకి చక్కెర తీసుకుంటే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టేనని హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ, మనం ఆ లెక్కలు ఎందుకు వేసుకుంటాం. టీ లో షుగర్ సరిపోలేదని కాస్తా.. ఇంకాస్తా అంటూ వేసుకుంటుంటాం. ఇలానే స్వీట్స్, బేకరీ ఐటెమ్స్‌పై మనసు పారేసుకుంటాం. ఒక్క పీస్ అంటూ తినేస్తుంటాం. ఇలా శరీరాన్ని షుగర్ ఫ్యాక్టరీలా తయారు చేస్తుంటాం. దీని వల్ల కేవలం డయాబెటీస్ మాత్రమే రాదు. మిగతా ఆరోగ్య సమస్యలన్నీ చుట్టుముడతాయి. అవే ఉబకాయం, గుండె సమస్యలు, అధికంగా తీపిని తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే కళ్లను శుక్లాలు, సైనస్, వినికిడి సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేనా, రోగ నిరోధక శక్తిని దెబ్బతిని అనేక సమస్యలు చుట్టుముడతాయని చెబుతున్నారు. కాబట్టి.. చక్కెర వాడకాన్ని తగ్గించుకోండని సలహాలిస్తున్నారు.


చక్కెర ఇలా శరీరంలోకి వెళ్తోంది..

కేవలం.. నేరుగా తీసుకుంటేనే చక్కెర శరీరంలోకి వెళ్లడం లేదు. కూరగాయలు, పండ్లూ, పాలు, రొట్టెలూ కార్బొహైడ్రేట్ల రూపంలోనూ శరీరంలోకి వెళ్తోంది. అయితే, కూరగాయలు, పండ్లూ, పాలు ద్వారా లభించే చక్కెర అంత ప్రమాదకరం కాదు. ఎందుకంటే వీటితో పాటు విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు ఉంటాయి. చక్కెరలో ఇవి ఏమాత్రం ఉండవు. అయితే, మనం తీసుకునే తీపి పదార్థంలోని కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారి శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి. మిగిలిందంతా కొవ్వులా మారుతుంది.

పంచదారకు ప్రత్యామ్నాయంగా..

చక్కెర అస్సలు మానేయాలని కాదు.. తక్కువ మోతాదులో తీసుకుంటే చాలు. అయితే.. ఒకవేళ ఇది కష్టమనుకుంటే.. దీనికి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే తేనె. అవును హనీని తీసుకోవడం వల్ల మెనీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. మిఠాయిలు, కేక్స్, గ్రీన్ టీ ఇలాంటి వాటిల్లో చక్కెరకు బదులు తేనె కలుపుకోవచ్చు. దీనివల్ల చక్కెర వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి తపపించుకోవచ్చు.

స్టీవియా అనే మొక్క నుంచి తీసిన తీపి పదార్థం కూడా మార్కెట్లలో వివిధ పేర్లతో దొరుకుతుంది. అయితే, ఇది నేరుగా కాకుండా శుద్ధి చేసినదే తీసుకోాలి.
వీటితో పాటు బెల్లంని కూడా తీసుకోవచ్చు.
అయితే.. దీనికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో దొరికే మాత్రలు వాడడం అంత శ్రేయస్కరం కాదని గుర్తుపెట్టుకోవాలి.
నిజానికీ మన భారత సాంప్రదాయ వంటకాలన్నింటినీ మరిచారు అందరూ. నువ్వుల ఉండలు, కొబ్బరి లడ్డూలు ఇలా ఎంతమంది తింటున్నారు. ఇవి ఎంత తిన్నా మంచిదే. వీటిని తినడం వల్ల పోషకాలు తప్ప అనర్థాలు లేవు. కానీ, వీటన్నింటిని ఎప్పుడో మరిచాం. కేవలం పిజ్జాలు, బర్గర్లు, కేకులు. ఇదే తిండి.. వీటిని తినాలని ఉబలాటం. వీటి పర్యవసనమే చిన్నతనంలోనే ఊబకాయం. అనేక సమస్యలు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి పిల్లల్ని చూస్తే జాలేస్తుంది. వారికి మన వంటల్లోని గొప్పతనం చెప్పేవారు లేరు. ఎందుకంటే మనకి తెలిస్తే వాళ్లకి చెప్పడానికి ఈ కారణంగా మనం ఏం తింటున్నామో వారు అదే తింటున్నారు. సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మేలుకొని సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి.

డయాబెటిస్ రకాలు.. డయాబెటిస్‌‌‌లో అనేక రకాలు ఉన్నాయి..

టైప్ 1 డయాబెటిస్ : ఫాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి.. ఎందుకిలా జరుగుతుందనేది శాస్త్రవేత్తలు ఇంతవరకూ గుర్తించలేదు.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో దాదాపు 10 శాతం మందికి ఈ టైప్ 1 ఉంది.
టైప్ 2 డయాబెటిస్ : క్లోమగ్రంధి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఒకవేళ ఉత్పత్తి అయినా సమర్థంగా పనిచేయదు. మధ్యవయస్సువారు, వయో వృద్ధుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అధిక బరువు, శరీర శ్రమలేనివారికి ఇది ఎక్కువగా ఉంటుంది.
కొందరు మహిళలకు గర్భ సమయంలో టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. గర్భంలోని శిశువకు అవసరమైనంత ఇన్సులిన్‌ని వారి శరీరాలు ఉత్పత్తి చేయలేకపోవటమే ఇందుకు కారణం. ఆహార నియమాలు, శారీరక వ్యాయామం అవసరమైతే ఇన్సులిన్‌ని వాడటం ద్వారా చక్కెర స్థాయిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

డయాబెటిస్ లక్షణాలు..

  1. మూత్రవిసర్జన ఎక్కువగా చేయడం, రాత్రిపూట మరీ ఎక్కువగా..
  2. అధికంగా దాహం వేయటం.
  3. అలసిపోయినట్లు అనిపించడం..
  4. చూపు తగ్గడం..
  5. శరీరం మీద గాయాలు, దెబ్బలు మానకపోవడం
  6. ఇవే కాక మరీ కొన్ని లక్షణాలు కూడా కనబడతాయి. కొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే డయాబెటీస్ దాడి చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

  1. మధుమేహం జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆహార నియమాలు, జీవనశైలి సరిగ్గా ఉంటే షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
  2. చక్కెరకు దూరంగా ఉంటూ పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోండి.
  3. ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, ఒమెగా 3 ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిది.
  4. వ్యాయామం చాలా ముఖ్యం. వారానికి కనీసం రెండున్నర గంటల పాటు ఏదైనా ఒక వ్యాయామం చేస్తూ ఉండాలి.
  5. ఖచ్చితంగా తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లని ఎక్కువగా తీసుకోవాలి.
  6. వీటితో పాటు చక్కెర శాతాన్ని తగ్గించుకోవడం చేస్తుండాలి. శీతలపానీయాలు, కాఫీ, టీలలో చక్కెర శాతాన్ని తగ్గించడం మంచిది.
  7. అదే విధంగా సరైన సమయానికి పడుకోవడం, నిద్రలేవడం చేస్తుండాలి. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్య సమస్యలు కామన్. కాబట్టి ఎలాంటి రిస్క్ చేయొద్దు.
  8. అదేవిధంగా.. ఎప్పటికప్పుడూ పరీక్షలన్నీ చేయించుకోవాలి.
  9. డయాబెటీస్ వ్యాధి అన్నీ సమస్యలకు మూలం. కాబట్టి ఈ సమస్య రాకముందు నుంచే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.



No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.